ప్రైవేట్ ఆసుపత్రిలో వసూలు చేసిన డబ్బులు వాపస్ ఇవ్వాలి  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి. ఖుతుబోద్దిన్ పాషా

కోరుట్ల  ముచ్చట్లు :

కరోనా పేరుతో అమాయక ప్రజల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగి వారికి డబ్బులు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దిన్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం మెట్ పెల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖుతుబోద్దిన్ పాషా మాట్లాడుతూ కరోనా సోకిన రోగి భయంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే రోగులను  భయబ్రాంతులకు గురిచేసి చేయని వైద్యాన్ని చేసినట్లు చెబుతూ, రోగుల వద్దనుండి లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేశారని ఆయన ఆన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక మొత్తంలో వసూలు చేసిన డబ్బులను రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రోగులకు చెల్లించాలన్నారు.కరోనా తో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు డబ్బులను పూర్తిగా చెల్లించాలన్నారు.లేని పక్షంలో ప్రైవేట్ ఆసుపత్రిల ముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మెట్ పల్లి యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జట్టి లక్ష్మణ్, మెట్ పల్లి మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్, యూత్ నాయకులు రాకేష్ హరీష్ ఇతరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Money collected at a private hospital must be refunded
Congress Party Town President MD. Khutuboddin Pasha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *