చెన్నై శ్మశానంలో గుట్టలు గుట్టలుగా డబ్బు

Money in Chennai Cemetery

Money in Chennai Cemetery

Date:09/02/2019
చెన్నై ముచ్చట్లు:
ఐటీ సోదాలకు భయపడిన ఓ వ్యాపారులు అతి తెలివికిపోయారు. సోదాల్లో తన దొంగ లెక్కలు, ఆస్తులు ఎక్కడ బయటపడతాయోనని సినిమా రేంజ్‌లో ఆలోచించారు. ఐటీ అధికారులకు దొంగ సొత్తు దొరక్కుండా చేయాలని పక్కా ప్లాన్ చేశారు. తన దగ్గరున్న డబ్బు, బంగారం, వజ్రాలు, విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లి శ్మశానంలో దాచారు. ఐటీ అధికారులు ఊరుకుంటారా.. కారు డ్రైవర్ దగ్గర తీగలాగితే శ్మశానంలో ఉన్న డొంక మొత్తం కదిలింది. వారం రోజులుగా తమిళనాడులో బడా వ్యాపారవేత్తలైన శవరణ స్టోర్స్ యజమానులు పొన్ను దొరై, బాలల ఇళ్లు, కార్యాలయాలు, షాపులపై ఐటీ ఫోకస్ పెట్టింది. మొత్తం 72 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. చెన్నై, కోయంబత్తూరులో శరవణ స్టోర్స్‌తోపాటుగా ఆ సంస్థతో సంబంధమ్ను రియల్ ఎస్టేట్ సంస్థలు లోటస్ గ్రూప్, జీస్కేర్‌లపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో వందల కోట్లలో ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడుల గురించి సమాచారం తెలుసుకున్న యజనమానులు దొంగ సొత్తు అధికారులకు దొరక్కుండా కాపాడుకోవాలని పథకం వేశారు. తమ దగ్గరున్న డబ్బు, బంగారం, డైమండ్లు, విలువైన డాక్యుమెంట్లను ఓ కారులోకి ఎక్కించారు. ముందు జాగ్రత్తగా తమ షాపులు, ఇళ్లు, ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్‌ను తొలగించారు. కారు డ్రైవర్‌ను ఊరంతా తిరుగుతూ ఉండమని చెప్పారు. ఐటీ అధికారులు అనుమానంతో ఓ వాహనాన్ని పట్టుకుంటే దొంగ సొత్తు డొంక కదిలింది. శ్మశానంలో సొమ్మును దాచినట్లు తేలింది. వెంటనే శ్మశానంలో తవ్వకాలు జరపించగా.. భారీ మొత్తంలో డబ్బు, బంగారం, డైమండ్లు దొరికాయి. వీటిలో రూ.25కోట్లు డబ్బు, 12 కేజీల బంగారం, 626 క్యారెట్ల డైమండ్లు ఉన్నాయి. అలాగే విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.433కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Tags:Money in Chennai Cemetery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *