చాపకింద నీరులా మంకీ పాక్స్
ముంబై ముచ్చట్లు:
కరోనా కేసులు మరోసారి పెరిగిపోతున్నాయి. ఆ టెన్షన్‌తో అల్లాడుతుండగానే.. ఇటు మంకీఫాక్స్ వ్యాప్తి గుబులు రేపుతుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరొకరికి మంకీఫాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరింది. డాక్టర్ల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ శనివారం తెలిపారు. 22 ఏళ్ల మహిళ శాంపిల్ శుక్రవారం పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉందని వివరించారు. బాధితురాలికి ఇటీవలి కాలంలో ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తుంది. ఈ ఏడాది జూలై 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీఫాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్‌గా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఢిల్లీలో తొలి కేసు నమోదు అయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్టయ్యింది. కేసుల ట్రేసింగ్ కోసం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా ఇండియాలో తొలి మంకీఫాక్స్ కేసు కేరళ(Kerala)లోని కొల్లం జిల్లాలో జూలై 14న నమోదైంది.ఫీవర్, బాడీ పెయిన్స్, తలనొప్పి అనేవి మంకీఫాక్స్ ప్రధాన సింటమ్స్. ఒంటిపై పొక్కులు కనిపిస్తాయి. దురద ఉంటుంది. వ్యాధి సోకిన మనిషితో సన్నిహితంగా ఉన్నా, వాళ్లు వాడిన వస్తువులు వినియోగించినా.. వారి సమీపంగా ఉన్నా కూడా గాలి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
Tags: Monkey pox is like water under the carpet

