Natyam ad

కోతులు..బాబోయ్… కోతులు

ఏలూరు ముచ్చట్లు:


దోమలు, మురుగు కాల్వలు రోడ్లు సమస్య ఇలా సామాజిక సమస్యలపై ఊరంతా పోరాడి హక్కులు సాధించుకుంటారు. కాని ఏలూరులోని ఆ గ్రామస్తులు మాత్రం కోతులు బాబోయ్ కోతులని హడలి పోతున్నారు . ఏకంగా జగనన్నకు చెబుతాం కు కాల్ చేసి తమను కాపాడాలని కోరుకున్నారు. ఏలూరు జిల్లాలో కోతుల పేరు వింటేనే ఆ ఊరు భయపడుతుంది. ఎపుడు ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తాయో అని బిక్కుబిక్కున వాళ్లు బ్రతుకుతున్నారు ఆ ఊరు గ్రామస్తులు. ఏ వస్తువైనా తమ ఇంటి ముందు ఆరపెడితే వాటిని అర క్షణంలో నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇంటి నుంచి పిల్లలను సైతం పెద్దలు బయటకు రానివ్వడం లేదు. అవసరం ఉంటేనే తప్ప పెద్దలు కూడా బయటికి వచ్చే సాహసం చేయడం లేదు. దీంతో వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామస్తులు ఆలోచించారు. సమస్య తీవ్రత అధికారులకు అర్థమయ్యే విధంగా గ్రామస్తులంతా ఒకే సమస్యపై ఫిర్యాదు చేయడంతో అధికారులు సైతం ఆ గ్రామానికి హుటాహుటిన పరుగులెత్తారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో వందల సంఖ్యలో కోతులు సంచరిస్తుంటాయి. అయితే ఆహార కొరత మరియు ఇతర కారణాల చేత అవి సమీపంలో ఉన్న జి కొత్తపల్లి గ్రామంలోకి వెలుతున్నాయి.

 

 

అయితే గ్రామంలోకి వెళ్లిన క్రమంలో వాటి కంటబడిన చిన్న పిల్లలు, పెద్దలపై వారేమన్నా చేస్తారనే భయంతో వారిని గాయపరుస్తున్నాయి.అంతేకాక వాటి కంటపడిన ప్రతి వస్తువులను, ఆరబెట్టిన పదార్థాలను సైతం నాశనం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. గత కొన్ని రోజులుగా కోతుల దాడులు మరీ ఎక్కువయ్యాయి. సమస్యను అలాగే విడిచి పెడితే మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు భావించారు. ఈ క్రమంలోనే వారంతా ఏకమై ప్రభుత్వ సహకారంతో సమస్య పరిష్కారానికి ఆలోచన చేశారు. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం ఆన్లైన్ పోన్ నెంబర్ ద్వారా తమ గ్రామంలో కోతుల సంచారం, దాడులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల్లో సుమారు 18 మంది ఆన్లైన్ ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో అధికారులు గ్రామానికి పరుగులెత్తారు. ద్వారకాతిరుమల ఎంపీడీవో సుబ్బరాయన్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటుచేసి కోతుల వలన జరిగిన దాడులను, వారికి కలిగిన ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అధికారులు స్పందించి పరిష్కారం చూపిస్తాననడంతో సంతోషం వ్యక్తం చేశారు.

 

Post Midle

Tags: Monkeys..Baboy…Monkeys

Post Midle