చిత్తూరు జిల్లాలో మరింత కఠినం-మంత్రి పెద్ధిరెడ్డిరామచంద్రారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు మంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు సరకుల కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. జూన్‌ 1 నుంచి జిల్లాలో ఉదయం 10గంటల తర్వాత కర్ఫ్యూ అమలులోకి వస్తుందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 2291 కొత్త కేసులు, 15 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ జిల్లాలో 1.85లక్షల మందికి పైగా కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 1.63లక్షల మందికి పైగా కోలుకోగా.. 1254మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,810 క్రియాశీల కేసులు ఉన్నాయి.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; More austerity in Chittoor district-Minister Peddareddy Ramachandrareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *