More bounded on the boundaries of Karnataka

కర్ణాటక సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టం

Date:28/03/2020

రామసముద్రం ముచ్చట్లు:

కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి రాకపోకలు లేకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రూరల్ సిఐ మధుసూదనరెడ్డి చెప్పారు. శనివారం ఆయన సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తమ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించవద్దని సూచించారు. అదేవిధంగా కాలినడకన రాష్ట్రంలోని కి ప్రవేశించే వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం ఆయన చెంబకూరు లో కిరాణా దుకాణం యజమాని ఉద్దేశించి మాట్లాడుతూ జమానులు ప్రభుత్వం సూచించిన ఈ వేళల్లో మాత్రమే దుకాణాలు తెరవాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.1000 జరిమానా, రెండురోజులు జైలు శిక్ష విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు అవసరం లేకుండా వీధుల్లో సంచరిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు, ప్రజలు సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. పర్యటనలో ఆయన వెంట రామసముద్రం ఎస్సై రవికుమార్, సిబ్బంది ఉన్నారు.

పోలీసులకు, కార్మికులకు సేవలందిస్తున్న దాతలు

Tags: More bounded on the boundaries of Karnataka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *