రోజాకు మరింత కష్టకాలం

More difficult for Roja

More difficult for Roja

Date:19/05/2018
విజయవాడ ముచ్చట్లు:
న‌గ‌రి ఎమ్మెల్యే రోజా సెల్వ‌మ‌ణి.. గెలిచినా పార్టీ అధికారంలోకి రాలేదు. వైసీపీతో తానే రెండోస్థానంలో ఉన్నానంటూ తెగ ఫీల‌య్యి.. చివ‌ర‌కు నోటిదురుసుగా అధికార పార్టీపై దుమ్మెత్తిపోసేది. గ‌త ఎన్నిక‌ల్లో సాధార‌ణ మెజార్టీతో గెలిచిన రోజా.. వైసీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రిప‌ద‌వి గ్యారంటీ అని ఆశించారు. కానీ.. ఊహించిన విధంగా జ‌గ‌న్‌కు ఎదురైన ఝ‌ల‌క్‌తో ఆమెకు నిరాశే ఎదురైంది. పైగా .. సినిమాల్లో సంపాదించిన సొత్తంతా ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుచేయ‌టంతో ఇప్పుడు కేవ‌లం బుల్లితెర షోల‌తోనే నెగ్గుకు రావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. కొద్దిరోజులుగా జ‌బ‌ర్ద‌స్త్‌లో కూడా క‌నిపించ‌ట‌లేదు. సినిమా షూటంగ్‌లో బిజీగా ఉన్నానంటూ చెబుతున్నా.. వాస్త‌వానికి.. ఆమెకు జ‌బ‌ర్ద‌స్త్‌తో మంచిపేరుతో పాటు ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కూ అవ‌కాశం ఇచ్చేందుకు వీలు క‌ల్పించిన‌ట్ల‌యింద‌ట‌.దీంతో.. ఆమె ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ట‌. పోనీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు వ‌స్తుందా! అంటే న‌మ్మ‌కం త‌క్కువేనంటూ.. జ‌గ‌న్ ఆల్రెడీ రోజాకు చెప్పేశార‌ట‌. నీ నోటివల్ల‌నే పార్టీ ప‌రువు పోయిందంటూ కూడా మండిప‌డిన‌ట్లు పార్టీవ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నా,యి. ఇదిచాల‌ద‌న్న‌ట్లు.. ఇటీవ‌ల  ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణంతో న‌గ‌రిలో సెంటిమెంట్ ఆ ఫ్యామిలీకు సానుభూతి పెరిగింది. దీంతో ఇక్క‌డ ముద్దుకృష్ణ‌మ‌నాయుడు త‌న‌యుడు బ‌రిలోకి దిగే అవ‌కాశాల‌న్నాయి. దీంతో సెంటిమెంట్ వ‌ర్క‌వుట‌య్యే వీలుంద‌ని టీడీపీ భావిస్తోంది. ఏ దిక్కున చూసినా.. రోజాకు.. చుక్క‌లే క‌నిపిస్తున్నాయ‌ట‌. పైగా న‌గ‌రి ప్ర‌జ‌లు కూడా రోజా ఏమీ చేయ‌లేకపోయింద‌నే అభిప్రాయ ప‌డ‌తున్నారు. అటు బుల్లితెర‌.. ఇటు రాజ‌కీయ జీవితం రెండూ చేజారి పోవ‌టంతో రోజా రెండికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంద‌ని తెగ బాధ‌ప‌డిపోతున్న‌ట్లు స‌మాచారం. ఆమె అభిమానులు మాత్రం.. జ‌గ‌న్ అన్న సీఎం అయితే.. ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతారా అంటూ ఆశ‌ప‌డుతున్నార‌ట‌.
Tags: More difficult for Roja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *