మరింత పెరిగిన ఆయిల్

Date:22/04/2019

ముంబై ముచ్చట్లు :
ఇండియన్ స్టాక్ మార్కెట్ సోమవారం కుప్పకూలింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 495 పాయింట్లు నష్టపోయింది. 38,645 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో 11,594 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, హెవీ వెయిట్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి వంటి అంశాలు మార్కెట్‌ను పడేశాయి. నిఫ్టీ 50లో భారతీ ఎయిర్‌టెల్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బ్రిటానియా షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్ 1 శాతానికి పైగా పెరిగింది. విప్రో కూడా 1 శాతం లాభపడింది. రూపాయి క్షీణతఐటీ షేర్లకు కలిసొచ్చింది. అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసీ, హిందాల్కో, రిలయన్స్ షేర్లు భారీగా క్షీణించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకంగా 9 శాతానికి పైగా పతనమైంది. యస్ బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు 6 శాతానికి పైగా నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 3 శాతానికి పైగా పడిపోయింది. ముడిచమురు ధరల పెరుగుదల మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు దాదాపు 6 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఒకే రోజు 3 శాతం ర్యాలీ చేశాయి.సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం లాభాల్లో ముగిసింది. బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. మెటల్, ఆటో షేర్లు కూడా పతనమయ్యాయి.
Tags:More oil grown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *