మరింత తగ్గిన బంగారం ధర

More reduced gold prices

More reduced gold prices

Date:13/11/2019

ముంబై ముచ్చట్లు:

పసిడి ధర తగ్గుతూనే వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.39,510కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.30 తగ్గింది. దీంతో ధర రూ.36,220కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,750కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ధర స్థిరంగా కొనసాగుతోంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,200 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా రూ.37,000 వద్ద కొనసాగుతోంది.బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,750కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 1,458.55 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.40 శాతం పెరుగుదలతో 16.75 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

 

భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్

 

Tags:More reduced gold prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *