పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలను అందించనున్నట్లు క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ పి.శివ తెలిపారు. ఆదివారం సాయంత్రం క్లబ్ కార్యాలయంలో బెంగళూరుకు చెందిన క్లబ్ మాజీ గవర్నర్ భక్తవత్సలరెడ్డి, జోన్ చైర్మన్ సుబ్బారెడ్డి, అరుణ్‌కుమార్, గోపికృష్ణలతో కలసి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంపిణీలో పేదలకు కుట్టిమిషన్లు, గొడుగులు, విద్యార్థులకు బెడ్‌షీట్లు, ఆసుపత్రికి డయాలసిస్ మిషన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు పంపిణీ చేశామన్నారు. అలాగే పదోతరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ మాట్లాడుతూ క్లబ్ ద్వారా రూ.5 లక్షలు విలువ చేసే వస్తువులను కొనుగోలు చేసి 125 మందికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యం కోసం విరివిగా వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు. పశువులకు వైద్యసేవలు అందించేందుకు పశువైద్యశిబిరాలు కూడ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి, ప్రతినిదులు గోపాలకృష్ణ, వరదారెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజారెడ్డి, రఘుపతి, సురేష్, రిజ్వి, మహేంద్రరావు, సుధాకర్, వేణుగోపాల్, సివి.రెడ్డిప్రసాద్, జి.వేణుగోపాల్, ఎస్‌ఆర్.సతీష్‌కుమార్, పి.మల్లికార్జునరెడ్డి, జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: More service activities by Lions Club in Punganur