గులాబీ పార్టీకి 19 కోట్లకు పైగా విరాళాలు

More than 19 crore donations to the pink party

More than 19 crore donations to the pink party

Date:26/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్నికలు..భారీగా డబ్బు..ఖర్చు ఉంటుంది. వివిధ పార్టీలకు పలు సంస్థలు..ప్రముఖ వ్యక్తులు ఆయా పార్టీలకు విరాళాలు ఇస్తుంటాయి. కానీ ఎన్ని విరాళాలు అందాయో కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాల్సినవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11వ తేదీన ఫలితాల ప్రకటన రానున్న సంగతి తెలిసిందే. దీనితో విరాళాలు ఎంత అందాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేశాయి. ఫారం 24 ఏ ప్రకారం ఎవరెంత విరాళమిచ్చారో పేర్కొంటూ ఆయా పార్టీల కార్యదర్శుల పేరిట విరాళాల లెక్కని తెలియచేశారు. టీఆర్ఎస్‌కు అందినవి…వివిధ వ్యక్తులు..సంస్థలు ఇచ్చిన విరాళాలు రూ. 19 కోట్ల 41 లక్షలు అని టీఆర్ఎస్ వెల్లడించింది. 2018 ఏప్రిల్ నుండి జులై వరకు విరాళాలు. పార్టీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ పేరిట ఎన్నికల సంఘానికి వివరాలు. రాఘవ కన్ స్ట్రక్షన్స్, శ్రీ వెంకటేశ్వర ఎంటర్ ప్రైజెస్ రూ. 2 కోట్లు..మల్లారెడ్డి, హోటల్ పార్క్ కాంటినెంటల్ ఏరో స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్..టి.భాను ప్రసాద్ రూ. కోటి చొప్పున విరాళాలు.
కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరెస్ట్ ఇన్ ఫ్రా వెంచర్స్ ఇండియా…శ్రీ కాకతీయ ఇండస్ట్రీస్ రూ. 50 లక్షల చొప్పున విరాళాలు అందచేశాయని పేర్కొంది.  కాంగ్రెస్‌కు అందినవి..కాంగ్రెస్ పార్టీకి రూ. 26 కోట్ల 65 లక్షల విరాళాలు. 2017-18లో సెప్టెంబర్ 28 వరకు విరాళాలు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్ పేరిట వివరాలు అందజేత. దేశంలోని ప్రముఖ సంస్థళు..మాజీ మంత్రులు..ఎంపీలు..ప్రైవేటు వ్యక్తులు విరాళాలు అందచేశారని..ఆదాయ పన్ను చట్టానికి లోబడి విరాళాలు స్వీకరించామని పేర్కొంది.  వైసీపీకి అందినవి… వైసీపీకి రూ. 8 కోట్ల 35 లక్షల విరాళాలు. 2017-18 సంవత్సరంలో విరాళాలు. లెకాన్ ఇన్ ఫ్రా సంస్థ రూ. కోటి 50 లక్షలు..ఫ్రంట్ లైన్ ట్రేడింగ్ రూ. 75 లక్షలు…సరస్వతీ పవర్ కంపెనీ రూ. 33 లక్షలు..ఇచ్చాయని వైసీపీ పేర్కొంది.  టీటీడీపీికి అందినవి…టీటీడీపీకి రూ. 1 కోటి 73 లక్షల విరాళాలు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో విరాళాలు. ఏపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రూ. 25 లక్షలు…బిల్డర్ వీఎస్ఎస్ఆర్ ఆంజనేయులు రూ. 11 లక్షలు..ఎంపీ గల్లా జయదేవ్..ఆంధ్రా షుగర్స్ ఎండీ బుల్లి రామయ్య..దేవినేని అవినాష్..ఈఎమ్ఎస్ సంస్థ..చెరో రూ. 10 లక్షలు.
Tags:More than 19 crore donations to the pink party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *