ప్రతీ వంద మందిలో 50 మందికిపైగా కంటి సమస్య

More than 50 of every hundred people have an eye problem

More than 50 of every hundred people have an eye problem

Date:13/10/2018
వరంగల్ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం అభాసుపాలవుతోంది. కంటి చూపులో దూరపు చూపు, దగ్గరి చూపు కనబడని వారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్నవారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి అద్దాలకు ఆర్డర్‌ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్‌ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని సమాచారమిచ్చారు.
కంటి పరీక్షలు ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టినా అద్దాలు ఇంత వరకూ రాలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అద్దాలు ఎప్పుడు వస్తాయని కంటి వెలుగు శిబిరాల్లో అడిగినా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారుపరీక్షలు చేసిన వైద్యాధికారులు అద్దాలు అందజేయడం లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అద్దాల గురించి కంటి చూపు బాధితులు స్థానిక ఆశ కార్యకర్తలను అడిగితే ఎప్పుడొస్తాయో తమకు తెలియదంటుండగా,
వైద్యాధికారులు ఆర్డర్‌ పెట్టామని, త్వరలో వస్తాయని దాటవేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా అద్దాలు అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో నిర్వహించిన కంటివెలుగు పరీక్షల్లో ప్రతీ వంద మందిలో 50 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.
కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం తొమ్మిది రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచింది. 1.0 ఆర్‌ఎంబీఎఫ్‌ నుంచి 2.5ఆర్‌ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్‌ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి.
Tags: More than 50 of every hundred people have an eye problem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *