పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తు తెలియని అస్థిపంజరాలు

న్యూ ఢిల్లీ   ముచ్చట్లు:

కొద్ది రోజుల క్రితమే బ్రిటిష్ కొలంబియాలో మూసేసిన ఓ పాఠశాల ప్రాంగణంలో 215 అస్థిపంజరాలు బయటపడ్డ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన మరువక ముందే మరో దారుణం బయటపడింది. వాంకోవర్‌లోని మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తు తెలియని అస్థిపంజరాలను స్థానిక అధికారులు గుర్తించారు. ఇవన్నీ చిన్నారుల సమాధులేనని తెలుస్తోంది. తవ్వకాలు చేపట్టి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు.హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కెనడాకు చెందిన అనేక మంది పిల్లలు క్రిస్టియన్ మిషినరీ పాఠశాల్లలో చదివేవారు. అయితే ఆ పాఠశాలల్లో అనేక దారుణాలు జరిగేవని నిజ నిర్ధారణ కమిషన్ ఓ నివేదికలో వెల్లడించింది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కనీసం 3,200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై శారీరక, లైంగి వేధింపులు జరిగాయని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను కొట్టేవారని ఇటీవలె కెనడా అంగీకరించింది. ఇదిలా ఉంటే ఆ పాఠశాలల్లో ఇంతకు మించిన పరిణామాలేమైనా జరిగాయా అనే కోణంలో కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైనా ప్రకృతి విపత్తు లాంటిది సంభవించి ఈ దారుణాలు జరిగాయా అనే వైపున కూడా అధ్యయనాలు కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు తెలుపుతున్నారు.ఈ ఘటనపై ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే తన హృదయం బద్ధలైందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను తాము బయటపెడతామని ఆయన ప్రకటించారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:More than 600 unmarked skeletons on the school campus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *