మరింత పెరిగిన కూరగాయల ధరలు 

More Vegetable Prices

 Date:11/02/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:
 నిత్యం తినే కూరగాయల ధరల్లో ఈ వారం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. దాంతో పేద, మధ్యతరగతి చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలు నిలకడాగా ఉంటాయా లేక వచ్చే వారం పెరిగే అవకాలు ఉన్నాయా అంటూ ఆవేదన చెందుతున్నారు. కొన్ని కూరలు కొనలేక వెనుతిరుగు తున్నారు.  నగరంలోని జ్ఞానాపురం హోల్‌సేల్‌ మార్కెట్‌కు అన్ని రకాల కూరగాయలు దిగుబడులు అధికంగానే ఉన్నాయి. సాధారణంగా దిగుబడులు పెరిగిన సందర్భంలో కూరగాయల ధరలు తగ్గాలి. అయితే వివాహాలు, పలు శుభకార్యాలు, అధికంగా ఉండడంతో నగరంలోని 13 రైతు బజార్లలో కూరగాయలు ధరలు పెరిగాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. రైతుబజార్లలో గత వారంతో పోల్చితే ఈ వారం పర్చిమిర్చి ధరలు పెరిగాయి. గత వారం కిలో మిర్చి  రూ.20 ఉండగా, ఈ వారం రూ.26కు పెరిగింది.. మిర్చి రూ.24 నుంచి రూ.32కు పెరిగింది.. ధరలు పెరిగిన వాటిలో
బీరకాయలు రూ.52 నుంచి రూ.54కి, బెండకాయలు రూ.48 నుంచి రూ.50కి, బీన్స్‌ రూ.36 నుంచి రూ.44కి, తెల్లవంకాయలు రూ.16 నుంచి రూ.18కి నల్లవంకాయలు రూ.16 నుంచి రూ.18కి, వెల్లంకి వంకాయలు రూ.22 నుంచి రూ.24కి, దొండకాయలు రూ.28 నుంచి రూ.38కి, గోరుచిక్కుడు రూ.24 నుంచి రూ.30కి, చిక్కుడు కాయలు రూ.20 నుంచి రూ.24కి, కంద రూ.16 నుంచి రూ.18కి, బరబాటీలు రూ.22 నుంచి రూ.24కి, మునక్కాయలు రూ.46 నుంచి రూ.50కి, కాలీఫ్లవర్‌ రూ.8 నుంచి రూ.12కి, గుడ్లు డజను రూ.52 నుంచి రూ.53కి పెరిగాయి. ఇలా ఉండగా కొన్నింటి ధలు స్వల్పంగా తగ్గాయి. మరికొన్ని నిలకడగా ఉన్నాయి. కాకరకాయలు రూ.38 నుంచి రూ.34కి తగ్గింది.. క్యాప్సికం రూ.38 నుంచి రూ.34కి తగ్గాయి. ధరలలో ఎటువంటి మార్పు లేనివాటిలో ఉల్లిపాయకలు రూ.11, బంగాళాదుంపలు కొత్తవి రూ.10, పాతవి రూ.8, టమాటో రూ.14, క్యాబేజీ రూ.11, చామదుంపలు రూ.18, క్యారట్‌ రూ.14, ఆగాకరకాయలు రూ.52, బీట్‌రూట్‌ రూ.20, బీన్స్‌ పిక్కలు రూ.50, చిలకడ దుంపలు రూ.18, ఆనపగాయ రూ.10, అరటికాయలు పెద్దవి రూ.5, చిన్నది రూ.4, వెల్లుల్లి రూ.34లుగా ఉన్నాయి.
Tags:More Vegetable Prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *