అనుమానాస్పద స్థితిలో బావిలో పడి తల్లి బిడ్డలు మృతి,

-ఒకే సారి ముగ్గురు మృత్యు వడిలోకి..

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

గుఱ్ఱం కొండ మండలం టి రాచపల్లి పంచాయతీ దిగువ బురుజు పల్లెకు చెందిన లావణ్య తన ఇద్దరు బిడ్డలు పరమేష్ (4)మౌనిక(3)తో బావిలో పడి అనుమానాస్పద ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఒకే సారి ముగ్గురు మృత్యు వాత పడడం ఘటన ఎన్నో అనుమానాలకు దారితీసింది.గుఱ్ఱం కొండ మండలం దిగువ బురుజుపల్లి చెందిన ప్రతాప్ రెడ్డి ఓబులేశ్వరి దంపతుల కుమార్తె లావణ్య తో పీలేరు మండలం జాండ్ల పంచాయతీ దిగువ పల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి తో 2016లో వివాహం జరిగింది.సుబ్రహ్మణ్యం రెడ్డి తెలంగాణ మహబూబా బాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో ఈ నెల16వ తేది లావణ్య తాత కర్మక్రియలకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో తన భార్య పిల్లలను తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు.అందుకు లావణ్య నిరాకరించింది. కనీసం పిల్లల్ని తీసుకో వెళ్ళటానికి కూడా తన భార్య నిరాకరించింది.

 

 

 

ఈ నేపధ్యంలో లావణ్య తమ ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకొని ఎవరూ లేని సమయంలో వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది.మృతురాలి తల్లి ఓబులేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు,ఘటనా స్థలం చేరుకొన్న గుఱ్ఱం కొండ పోలీసులు ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో మృతు దేహాలను బైటికి తీసి కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.గుఱ్ఱం కొండ మండలం దిగువ బురుజు పల్లిలో ముగ్గురు మృతి చెందిన ఘటన చోటుచేసుకోవడం తో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

Tags: Mother and child died after falling into a well under suspicious circumstances.

Leave A Reply

Your email address will not be published.