Natyam ad

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె సమీపంలో ఆదివారం ఉదయం జాతీయ రహదారిపై డివైడర్‌ను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తల్లీ, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన రఘువరన్ రాజు కుటుంబ సభ్యులు లేపాక్షికి వెళ్తుండగా గార్లదిన్నె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొనడంతో కారులో అందులో ప్రయాణిస్తున్న జయంతి , కీర్తన  అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

 

Tags: Mother and daughter died in a road accident

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.