అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్లి కూతురు-స్పందించిన పోలీసులు
నెల్లూరు ముచ్చట్లు :
అర్ధరాత్రి నడి రోడ్డుపై వారి కారు పంక్చర్ అయింది. కారులో ఉన్నది కేవలం ఓ తల్లి, ఆమె కూతురు. చుట్టూ చిమ్మ చీకటి. కారు దిగి పంక్చర్ వేద్దామనుకున్నా… కారు డోరు తెరిచి, తెగించి దిగితే ఏమవుతుందో అనే భయం. దిశా యాప్ కి ఎస్.ఓ.ఎస్. కాల్ చేశారు. నిమిషాల్లో చిన మర్రిపాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళన చెందింది. వెంటనే తేరుకుని దిశా యాప్ ఎస్వోఎస్ కాల్ చేసింది. కేవలం 10 నిముషాలలో పోలీసులు వారి వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించారు చిన మర్రిపాడు పోలీసులు. ఆమె కారు టైర్ మార్పించి, సురక్షితంగా గమ్యం చేరేలా సహకరించారు.
Tags: Mother and daughter on the sidewalk in the middle of the night – police responded

