Date:27/11/2020
మహబూబ్ నగర్ ముచ్చట్లు
కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలం హస్నాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్ప, ఎల్లమ్మ(26) భార్యాభర్తలు. వీరికి రజిత(8) అనిత, రాజు(4) అనే ముగ్గురు సంతానం. ఈరోజు ఉదయం కుటుంబ పరిస్థితుల విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో కలత చెందిన ఎల్లమ్మ తన ముగ్గురు పిల్లలు రాజు, రజిత, అనితతో కలిసి కొడంగల్ మండలం హస్నాపూర్ చెరువు వద్దకు చేరుకుని పిల్లలందరికీ చున్నీతో చేతులు కట్టేసి తను కూడా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో అనిత అనే అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. కానీ ఎల్లమ్మ, రాజు, రజిత ముగ్గురు చెరువులో పడి చనిపోయారు
తుఫాను ప్రభావంతో గొర్రెలు మృతి
Tags:Mother commits suicide with two children