Natyam ad

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో సిరుల తల్లి

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చ‌ర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించారు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.

 

 

Post Midle

మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.అలాగే రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, ఈవో  ఎవి ధర్మా రెడ్డి దంపతులు,చంద్రగిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జెఈవో  వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసచార్యులు, విఎస్‌వోలు  మనోహర్,  బాలి రెడ్డి, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు  బాబు స్వామి, సూపరిండెంట్ శ్రీ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్  దాము పాల్గొన్నారు.

 

Tags: Mother of Sirula in Sri Rajamannar Alankaram on Kalpavriksha vehicle

Post Midle

Leave A Reply

Your email address will not be published.