24న అచరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా సేవా పురస్కారాలు

Date:16/01/2021

నెల్లూరు ముచ్చట్లు:

అచరిత్వ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24న మదర్ థెరిస్సా రాష్ట్ర , జాతీయ స్థాయి సేవ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పి జి డి కృపాల్ తెలియజేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలతో పాటు, ఆయా రంగాలలో ప్రతిభ కనపరిచిన స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులకు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి మదర్ తెరిసా సేవ పురస్కారాలకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్ స్థాపించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నప్పటికీ, అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా ఆదరణ కోరడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తమ సంస్థ ప్రధమ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తదితర తెలుగు రాష్ట్రాల తో పాటు, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అత్యవసర, సామాజిక, వాతావరణ వైపరీత్యాల ఇతర సందర్భాలలో తమ వంతు ఆయా ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందించిన, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థి, ఉపాధ్యాయ, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, కళలు, క్రీడలు, విద్య వైద్యం, యోగ, సామాజిక, వ్యవసాయ ఇతర రంగాలతో పాటు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీవీ, సినిమా, మిమిక్రీ, మ్యాజిక్, పబ్లిక్ సర్వెంట్స్, జర్నలిస్టులు, మనసున్న దాతలు ఈనెల 31 లోపు తమ తమ సంస్థల ద్వారా, గత రెండు సంవత్సరాలుగా అందించిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, పత్రికల క్లిప్పింగుల తో పాటు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అచరిత్వ పౌండేషన్ అట్ ద రైట్ ఆఫ్ జి మెయిల్ డాట్ కాం లేదా కృపాల్ పిడతల అట్ద రైట్ ఆఫ్ జి మెయిల్ డాట్ కాం తదితర ఈమెయిల్ లకు పంపించవలసినదిగా కోరారు. పూర్తి వివరాలకు 9494443206,9866722532,8309665565 ఫోన్ నంబర్లను సంప్రదించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో నిస్సి ఫిజియోథెరపీ అధినేత డాక్టర్ రాజేష్, పౌండేషన్ కోఆర్డినేటర్ జానీ జో, సభ్యులు సంజయ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:Mother Theresa Service Awards under the auspices of the Acharitva Foundation on the 24th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *