చిన్నపిల్లల మానసిక ఆరోగ్యానికి మాతృభాషకు ముడిపడి ఉంది

-జెడి పౌండేషన్ కన్వీనర్ మాకినేని  అరుణ
 
నెల్లూరు ముచ్చట్లు:
చిన్న పిల్లల మానసిక ఆరోగ్యానికి వారి మాతృభాషతో ఉండే అనుబంధానికి సంబంధం  ఉంటుందని జెడి పౌండేషన్ కన్వీనర్ మాకి అని అరుణ పేర్కొన్నారు. జె.డి.ఫౌండేషన్ మరియు శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం  అల్లూరు లోని రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నందు “తెలుగు-వెలుగు” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జె.డి.ఫౌండేషన్ కన్వీనర్ మాకినేని అరుణ మాట్లాడుతూ మాతృభాషలో మాట్లాడేటప్పుడు మనస్సు-మెదడు- నాలుక మధ్య సంబంధం ఉందని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎమ్. రామ్మూర్తి మాట్లాడుతూ పిల్లలు పసిప్రాయంలో మాతృభాష ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టి, తరువాత మరో భాష నేర్చుకుంటే వారి విద్యా జీవితం ఒడిదుడుకులు లేకుండా సాపీగా సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ రాజు చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి మురళీ మోహన్ రాజు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పరశురాం, మోటివేటర్ మాలకొండారెడ్డి, జంద్యాల సుమతి, రవి గోగులపల్లి, పుట్టా మస్తాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags; Mother tongue is linked to the mental health of young children