Natyam ad

బిడ్డకు తల్లి పాలు తప్పనిసరి-సర్పంచ్ పల్లె ప్రతిమ

కమాన్ పూర్ ముచ్చట్లు:

బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి అని, శ్రేయస్కరమని సర్పంచ్ పల్లె ప్రతీమ పీవీరావు అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు-2022 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఈ వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలనే వాడాలని, అందుకుగాను అంగన్వాడి కేంద్రాల్లో పోషక విలువలతో కూడిన ఆహారం ఇస్తున్నామని తెలిపారు. బిడ్డ పుట్టిన గంట తర్వాత తల్లి పాలు పట్టించలన్నారు.దీనివల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ తెలిపారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణీలకు,పిల్లతల్లులకు పౌష్టికాహారం విలువలు తెలియచేశారు. సీమంతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు పల్లె అమర, తోగారు పాపమ్మ తదితరులు పాలుగొన్నారు.

 

Post Midle

Tags: Mother’s milk is a must for a child-Sarpanch Palle Pratima

Post Midle

Leave A Reply

Your email address will not be published.