బిడ్డకు తల్లి పాలు శ్రేయస్కరం-ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి

కమాన్ పూర్ ముచ్చట్లు:

బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి అని, శ్రేయస్కరమని కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మి రవి సర్పంచ్ ఆకుల ఓదెలు అన్నారు. కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు-2022 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఈ వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలనే వాడాలని, అందుకుగాను అంగన్వాడి కేంద్రాల్లో పోషక విలువలతో కూడిన ఆహారం ఇస్తున్నామని తెలిపారు. బిడ్డ పుట్టిన గంట తర్వాత తల్లి పాలు పట్టించలన్నారు.దీనివల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ తెలిపారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణీలకు,పిల్లతల్లులకు పౌష్టికాహారం విలువలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు విజయలక్ష్మి శివనాగాంజలి ఏఎన్ఎం ఇందిరా తదితరులు పాలుగొన్నారు.

 

Tags: Mother’s milk is good for the baby – MPP Rachakonda Lakshmi Ravi

Leave A Reply

Your email address will not be published.