తల్లి పాలే ముద్దు-డబ్బా పాలు వద్దు-మంత్రి హరీష్ రావు

తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకా తో సమానం.
నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి 3 వేల రూపాయల ప్రోత్సాహకం
ఆరోగ్య సేవల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానం
మదర్ మెర్టాలిటీ రేటు తగ్గించడం లో తమిళనాడును అధిగమించాం

హైదరాబాద్ ముచ్చట్లు:


పెట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన  తల్లి పాల వారోత్సవాల్లో  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గోన్నారు. మిల్క్ బ్యాంక్ ను అయన ప్రారంభించారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ పెట్ల బురుజులో తల్లి పాల బ్యాంక్  ప్రారంబించుకున్నాం. తల్లి పాలు దొరకని వారికి ఇది ఉపయోగపడుతోంది. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అమృతం తో సమానం. దీన్ని మరి దేంతో పోల్చలేం.  ఎన్.ఎస్. యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లి పాలు అందాలన్న ఉద్దేశంతో పేట్ల బురుజులో ఆగష్టు 1 నుండి 7వ  తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్ వో తల్లి పాల వారోత్సవాన్ని జరుపుతోంది. ఎ.ఎన్. సి చెక ప్ కు వచ్చినప్పటి నుండి  తల్లి పాల శ్రేష్టత తెలిపేందుకు  ఈ వారోత్సవాలు. తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచంలో 88 శాతం మంది తల్లులు ఆరు నెలల పాటు తమ పిల్లలకు పాలు ఇచ్చే  దేశం బంగ్లాదేశ్. గ్రీన్ నేషన్  గా బంగ్లాదేశ్ ను డబ్ల్యూహెచ్ వో గుర్తించింది. మన దేశంలో కూడా ఇస్తున్నారు. కేవలం 36 శాతం మంది మత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారు. 64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నారు.

 

 

 

తొలి గంటలో బిడ్డకు ఇచ్చే పాలు టీకాలతో సమానం. ప్రతీ తల్లీ గమనించాలి. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారు. సీ సెక్షన్ ఆపరేషన్ల వళ్ల ఇది జరుగుతోంది. తల్లి పాలు ముద్దు- డబ్బా పాలు వద్దు అన్న నినాదంతో ముందుకు పోవాలి. నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలి. డాక్టర్లే ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. కొద్ది ముంది ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేయమంటున్నారు. మరి కొద్ది మంది గర్బిణీ స్త్రీల కుటుంబ సభ్యులు- మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నరు. ప్రాణాపాయం బట్టి ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. గర్భిణీ స్త్రీలకు కొంత ఫిజికల్ ఎక్సైర్ సైజ్ చేయాల్సి ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల వారు కార్పోరేట్ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీ కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకమైన ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారని అన్నారు.
మనమేమో లక్షలు ఖర్చు పెట్టి కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లి సి- సెక్షన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నాం.  నార్మల్ డెలివరీల వల్ల కలిగే లాభాలను యూరోపియన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల వారు గుర్తించారు. తల్లికి, శిశువుకు నార్మల్ డెలివరీ వల్ల క్షేమం.  మొదటి గంటలో తల్లి పాలు, ఆరు నెలల పాటు అందడం వల్ల శిశు మరణాల రేటు 22 శాతం తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి.  శిశు మరణాలు తగ్గాలంటే తల్లి పాలు మొదటి గంటలో అందాలి, ఆరు నెలల పాటు నిరంతరాయంగా అందాలి. ఇవి మీరు దృష్టిలో పెట్టుకోవాలి.  రాష్ట్ర వ్యాప్తంగా ఎ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు,సర్పంచ్ లు గ్రా మ గ్రామాన తల్లి పాల వారోత్సవాల ప్రాముఖ్యత వివరిస్తున్నారు.  తెలంగాణ రాక ముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం కాన్పులు మాత్రమే అయ్యేవి.

 

 

ఇప్పుడు 61 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఇది గతంతో పోల్చితే రెట్టింపు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెంచగలిగాం. శానిటేషన్ చార్జీలు పెంచాం. ఒక మంచానికి నెలకు 5 వేల రూపాయల నుండి 7500 రూపాయలకు శానిటేషన్ ఖర్చు పెంచాం. శానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచాం. ఈ నెల నుంచి మీకు అవి అందుతాయి. ఈఎస్ఐ ఉంటుంది. పీఎఫ్ ఉంటుంది.  శానిటేషన్ సిబ్బందిపై ఏదైనా ఆరోపణలు వస్తే, సూపరిండెంట్లు కఠిన చర్యలు తీసుకునే అధికారం ఇస్తున్నాం. డబ్బులు రోగులను అడిగినట్లు తెలిస్తే ఇంటికి పంపడమే ఉంటుంది. దీనిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది..నేను ఆకస్మిక తనిఖీలు చేపడాతం. అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు.
అవసరమైన స్కానింగ్ లన్నీ ఇక్కడే చేయాలి. బయటకు పంప వద్దు . అందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఒక్క రోగి బయటకు వెళ్లవద్దు. మందులు బయటకు వెళ్లవద్దు. న్యూ బోర్న్ బేబీకి అవసరమైన చికిత్స, మందులు అందుబాటులోకి తెచ్చాం. నిధులకు కొరత లేదు. నమ్మకాన్ని పెంచాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు పెద్దఎ త్తున వచ్చేలా ప్రయత్నం చేద్దాం. బెడ్ల సంఖ్యను పెంచాలని అడిగారు. స్టాఫ్, మందులు ఎవి కావాలో సమీక్ష జరిపి చెప్పండి. అవన్నీ  ప్రభుత్వం సమకూరుస్తుందని అన్నారు.

 

 

ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా అది అందుబాటులో ఉంచుతాం. అలాగే ఏదైనా తప్పులు చేస్తే  ప్రభుత్వం అంతే కఠినంగా వ్యవహరిస్తుంది. గాంధీని, నిమ్స్ ను బలోపేతం చేస్తున్నం. ఏదైనా క్రిటికల్ కేసులు వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి పంపేలా చర్యలు తీసుకుంటున్నాం. శానిటేషన్ సిబ్బంది నుండి సూపరిడెంట్ వరకు  బాగా పని చేస్తే ప్రభుత్వం గుర్తిస్తుంది. అదే రీతిలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. గాంధీ, నిమ్స్ లలో చేరో 250 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని తెస్తున్నం. క్రిటికల్ కేసులు ప్రయివేటుకు వెళ్లకుండా అక్కడ చికిత్స అందేలా చర్యలు తీసుకుంటుంన్నం. 10 నుండి 10 శాతం రెఫరల్  జరుగుతోందని చెప్పారు. రెఫరల్ పై ఆడిట్ కూడా జరగాలి. ఎందుకు రిఫర్ చేశారన్నదానిపైన సమీక్ష జరపాలి. ఏదైనా పరిస్థితి చేయి దాటే కేసులు తప్ప  రిఫరల్ చేయవద్దని అన్నారు.

 

 

గైనిక్ కేసులో ఒక్క గర్భిణీని రెఫరల్ పంపడం లేదని వైద్యులు చెప్పారు. వారికి అభినందనలు. ప్రభుత్వం ఇదే కోరుకుంటుంది. ప్రతీ కేసు నమ్మకం పోకుండా నాణ్యమైన చికిత్స అందించాలి.  ఇంకా ఏదైనా స్పెషలైజేషన్ కేసులు చేస్తామంటే ప్రభుత్వం అందుకు పూర్తి సహకారం అందిస్తుంది. దేశ వ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ను ఇక్కడ అమలు చేద్దాం.  అందుకు ఫ్రోఫెసర్లు, డాక్టర్లు ముందుకు రావాలి. అవసరమైన ఎక్విప్మెంట్  కావాలంటే ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో45 శాతం సి సెక్షన్ జరుగుతోంది. 55 శాతం నార్మల్ డెలివరీ జరుగుతోంది. ప్రయివేటు లో 80 శాతం సి సెక్షన్, 20 శాతం నార్మల్ డెలివరీ జరుగుతోంది.  ఇంతకు ముందు 75 శాతం సి సెక్షన్ జరిగేది. దాన్ని 45  శాతానికి తగ్గించగలిగాం. అందరం కలిసి ఆరోగ్య తెలంగాణ దిశగా సాగుదాం. మన హెల్త్ సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉంది. కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఉంది. ఇది కేంద్రం చెప్పింది. మదర్ మోర్టాలిటీ రేట్ లో తమిళనాడును అధిగమించగలిగాం.  సి సెక్షన్ చేస్తే 11 వేల రూపాయలు ఇచ్చేవాళ్లం. నెగిటెవ్ ఇంక్రిమెంట్. దాన్ని తొలగించి. ప్రతీ నార్మల్ డెలివరీకి 3 వేల రూపాయలు ఇంక్రిమెంట్  ఇస్తున్నం.  డాక్టర్లు, నర్సులు, ఆశాలు, ఎ.ఎన్.ఎంలకు ఈ ప్రోత్సాహకం. దీన్ని అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.

 

Tags: Mother’s milk kiss-don’t want milk

Leave A Reply

Your email address will not be published.