Natyam ad

ఆధార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు ప్రేరణ కార్యక్రమం.

తిరుపతి ముచ్చట్లు:

ఆధార్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మునిసిపల్ స్కూల్ లో చదువుతున్న పేద పిల్లలకు ఉన్నత విద్య మరియు జీవితం లక్ష్యాలపై అవగాహనపరిచి, ప్రేరణనిచ్చే కార్యక్రమం జరిగింది.తిరుపతి స్థానిక పల్లివీధిలోని మునిసిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు 4వ తరగతి నుండి 7వ తరగతి పిల్లలకు వక్రుత్వ మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ చూపిన పిల్లలకూ మరియు చదువులో ఉత్తమ విద్యార్థులకూ తరగతి వారీగా అతిథులచే జ్ఞాపికలు మరియు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయడం జరిగింది. స్కూల్లోని సుమారు 170 మంది పిల్లలకు అల్పాహారం పంచిపెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం నగరంలోని అన్ని మునిసిపల్ స్కూళ్ళల్లో నిర్వహించి పేద పిల్లలను ప్రోత్సాహంచే ప్రయత్నం నిరంతరం చేస్తామని ఆధార్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ముహమ్మద్ రఫీ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన 25వ డివిజన్ కార్పొరేటర్ కే. నరసింహాచారి మాట్లాడుతూ ఈ స్కూల్ ఈ ప్రాంతంలో ఏర్పడ్డానికి తాను కారణమైనందుకు సంతోషంగా ఉందని, ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నానని తెలిపారు.

 

 

Post Midle

మరో ముఖ్య అతిథి ప్రముఖ విద్యావేత్త, విశ్వం విద్యాసంస్థల అధినేత డా” ఎన్. విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వరంగ పాఠశాలలోనే చదువుకున్నానని, ఈ పిల్లలను చూస్తుంటే తన బాల్యం గుర్తొస్తోందన్నారు. ఈ స్కూల్లోని ఉత్తమ విద్యార్థులకు తమ సంస్థ తరపున సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఉచితంగా కల్పిస్తామని పిల్లలను ఉత్సాహపరిచారు.తదుపరి ముఖ్య అతిథి శంకరంబాడీ సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా” డి. మస్తానమ్మ మాట్లాడుతూ విద్యతోనే మంచి జ్ఞానం, నడవడిక పొందగలమన్నారు. పిల్లలకు మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు పంచిపెట్టారు.తిరుపతి సహకార టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షులు వాసు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి పోటీలల్లో తరచూ పాల్గొనడం వలన సృజనాత్మకత మరియు పోటీ తత్త్వం పెరుగుతుందని, తద్వారా చదువులోనూ, చదువానంతరం కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి, ఉపాధ్యాయరాళ్లు లక్ష్మి దేవి, నిర్మలా బాయి, హిమబిందు, అంగన్వాడీ టీచర్ జయసుధ, స్కూల్ సహాయకులు గీతా, నవనీత, ఆధార్ ఫౌండేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఈ. కుప్పయ్య, కోశాధికారి షేక్ సాధిక్ అహ్మద్, నాయకులు సి. మధుసూధన్ రెడ్డి, షేక్ ఇస్మాయిల్, షేక్ షాహుల్, నికేష్, లీలానంద, సతీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Motivation program for children under Aadhaar Foundation.

Post Midle

Leave A Reply

Your email address will not be published.