పుంగనూరులో మోటారు సైకిల్‌ దొంగకు 5 నెలల జైలు శిక్ష

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో మోటారు సైకిళ్లు చోరీ చేస్తున్న రాంపల్లె నివాసి జి.మునీంద్ర కు ఐదు నెలల జైలుశిక్ష విధిస్తూ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.సిందు మంగళవారం సాయంత్రం తీర్పు ప్రకటించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటకు చెందిన రంజిత్‌కుమార్‌ గత ఏడాది అక్టోబర్‌ 25 న తమ మోటారు సైకిల్‌ చోరీ కాబడిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టి, ముద్దాయి మునీంద్రను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 9 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను సీజ్‌ చేసి, కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కేసు విచారణలో ఏపిపి రామకృష్ణ ముద్దాయి చేసిన దొంగతనాలను సాక్షాదారాలతో కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల విచారణలు జరిగిన తరువాత సాక్షాధారలను పరిశీలించి, నిందితుడు మునీంద్రకు ఐదు నెలల జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి సిందు తీర్పు వెల్లడించారు.

 

Post Midle

Tags:Motorcycle thief jailed for 5 months in Punganur

Post Midle
Natyam ad