మోటారుసైకిలిస్టు మృతి

Date:22/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారుసైకిలిస్టు మృతి చెందిన సంఘటన మండలంలోని చదళ్ల వద్ద ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు రామసముద్రం మండలం గజ్జిలవారిపల్లెకు చెందిన రామచంద్ర(63) ద్విచక్రవాహనంలో వెళ్తూ చదళ్ల వద్ద పడి ఉండగా గ్రామస్తులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి , దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడు తనంతకు తానుగా పడిపోయాడా, లేదా ఏదైనా వాహనం ఢీకొని చనిపోయాడా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ మేరకు శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

పర్యావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Tags; Motorcyclist killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *