Date:27/01/2021
నందికొట్కూరు ముచ్చట్లు:
ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పని సరిగా పాటించాలని నందికొట్కూరు అర్బన్ సీఐ పేర్కొన్నారు.32 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ఆదేశాల మేరకు నందికొట్కూరు అర్బన్ సిఐ నాగరాజ రావు అధ్వర్యంలో బుధవారం నందికొట్కూరు ఆర్టీసి డిపో మేనేజర్ నాగేశ్వర రావు అధ్యక్షతన ఆర్టీసి బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టిసి కార్మికులకు, డ్రవేర్లకు , సిబ్బందికి పోలీసు అధికారులు రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు సెఫ్టీ పై అవగాహన కల్పిస్తూ పాటించవలసిన జాగ్రత్తలు, నిబంధనల గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంధర్బంగా సీఐ నాగరాజ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. రోడ్డుభద్రత ఉత్సవాలను ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహిస్తున్నామన్నారు.
రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా చూసేందుకు ప్రతిఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవడంతో పాటు లైసెన్స్, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రమాదాలలో యువకులే ఎక్కువగా మరణిస్తున్నారన్నారు. స్పీడ్ డ్రైవ్ , స్నేక్ డ్రైవ్, డంకెన్ డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తల్లిదండ్రలకు తీరని శోకం కలిగిస్తున్నారన్నారు. రహాదారి భద్రత నియమాల గురించి యువకులే ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డి, ఆర్టిసి కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు .
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం
Tags:Motorists and people must abide by the rules of the road.