పిండ మార్పిడికి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు – టిటిడి ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

 

 

పిండ మార్పిడి ప‌థంకం ద్వారా జ‌న్యుప‌రంగా ఉన్న‌త‌ ల‌క్ష‌ణాలు ఉన్న ఆవు దూడ‌ల‌ను పుట్టించి, త‌ద్వారా పాల ఉత్ప‌త్తి పెంచ‌డానికి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు కుదుర్చుకోవాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో గురువారం ఆయ‌న ఎస్వీ గో సంర‌క్ష‌ణ శాల, ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ స్వ‌దేశీ ఆవుల పెరుగు నుంచి నెయ్యి త‌యారు చేసి, స్వామివారి కైంక‌ర్యాలకు ఉప‌యోగించ‌డానికి, పాల నుండి నెయ్యి త‌యారు చేయ‌డానికి త‌గిన సాంకేతిక స‌ల‌హాలు అందించాల‌ని ప‌శు వైద్య క‌ళాశాల అధికారుల‌ను ఈవో కోరారు. స‌మీకృత ప‌శువుల దాణ త‌యారీకి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు కుదుర్చుకోవ‌డానికి విధివిదానాలు త‌యారు చేయాల‌న్నారు.ఇందుకోసం వారం రోజుల్లో ఒప్పందాలు కుదుర్చుకోవ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గో సంర‌క్ష‌ణ శాల డైరెక్ట‌ర్‌ను ఆదేశించారు.

 

 

 

గో సంర‌క్ష‌ణ‌శాల‌లో అధిక పాల ఉత్ప‌త్తికి త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. ఇందుకోసం గో శాల‌లోని అన్ని ఆవుల‌ను ప‌రిశీలించి, ప‌రీక్ష‌లు చేసి త‌గిన వైద్యం అందించేందుకు సాంకేతిక స‌హ‌కారం ఇవ్వాల‌ని ప‌శు వైద్య క‌ళాశాల అధికారుల‌ను కోరారు.ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డా.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, డా.స‌ర్జ‌న్‌రావు, డా.ర‌వి, డా.బ్ర‌హ్మ‌య్య‌, గో సంర‌క్ష‌ణ శాల డైరెక్డ‌ర్ డా.హ‌ర‌నాథ‌ రెడ్డి, డా.సుమ‌న్‌ త‌దిత‌రులు స‌మావేశంలో పాల్గొన్నారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: MoU with SV Veterinary University for Embryo Transplantation – TTD Evo Dr. Jawahar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *