Natyam ad

పాలస్తినాలో మృతులకు సంతాపం

పుంగనూరు ముచ్చట్లు:

పాలస్తినాలో యుద్ధంలో మృతి చెందిన బాధిత కుటుంభాలకు సంతాపం తెలుపుతూ పుంగనూరు అంజుమన్‌ కమిటి ఏకగ్రీవంగా ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం , ఉపాధ్యక్షుడు జాఫర్‌ఖాన్‌ , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌ , జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్‌ అమ్ము ఆధ్వర్యంలో ముస్లిం ముతవల్లిలు , మతగురువులు , ముస్లింతో సమావేశం నిర్వహించారు. పాలస్తినా, ఇజ్రయిల్‌ దేశాలు శాంతియుత వాతావరణంలో ఉండాలని, యుద్ధం మానుకోవాలని సూచించారు. మృతుల కుటుంభాలకు సంతాపం తెలుపుతూ సందేశం పంపారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఇబ్రహిం, హజ్‌కమిటి మెంబర్‌ ఖాదర్‌, అజీజ్‌సాబ్‌, ఇస్మాయిల్‌, జబివుల్లా , ఆరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Mourning the dead in Palestine

Post Midle