Mourning the employees who are causing the company to become worse:

సంస్థ ప్ర‌తిష్ట దిగ‌జారేందుకు కార‌ణ‌మ‌వుతున్న ఉద్యోగుల‌పై విచార‌ణ :

-తిరుప‌తి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌

Date:05/06/2020

తిరుపతి ముచ్చట్లు:

భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న టిటిడి సంస్థ ప్ర‌తిష్ట‌ దిగ‌జారేందుకు కార‌ణ‌మ‌వుతున్న ఉద్యోగుల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తిరుప‌తి జెఈవో   పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌నంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు   వైవి.సుబ్బారెడ్డి, ఈవో   అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి జెఈవో మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఇటీవ‌ల టిటిడి ఆస్తుల‌కు సంబంధించిన అంశంపై, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ఒక క‌థ‌నంపై తీవ్రంగా దుష్ప్ర‌చారం జ‌రిగింద‌న్నారు. టిటిడి ఆస్తుల‌పై శ్వేత‌ప‌త్రం రూపొందించాల‌ని మే 28న జ‌రిగిన బోర్డు స‌మావేశంలో తీర్మానం చేశార‌ని చెప్పారు. దీనికి సంబంధించి శ్వేత‌ప‌త్రం త‌యారీ ప‌నులు జ‌రుగుతుండ‌గా మే 30, 31వ తేదీల్లో ఈ వివ‌రాలు ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్ర‌సార‌మ‌య్యాయ‌ని తెలిపారు. అదేవిధంగా, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌లో 2016-17వ సంవ‌త్స‌రంలో ఒక పాఠ‌కురాలు పంపిన కుశుడి క‌థ ప్ర‌చుర‌ణ‌కు అర్హం కాద‌ని ప‌క్క‌న పెట్టార‌ని తెలిపారు. అయితే, అదే క‌థ‌ను బాల‌వాక్కు శీర్షిక‌న స‌ప్త‌గిరి ఏప్రిల్ నెల‌లో ప్ర‌చురించార‌ని చెప్పారు. ఏప్రిల్ నెల సంచిక ఇంకా మార్కెట్‌లోకి విడుద‌ల కాలేద‌ని, ఇంత‌లో కొంద‌రు దీనిపై తీవ్రంగా విమ‌ర్శించార‌ని తెలిపారు. ఈ రెండు అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచార‌ణ చేప‌ట్టామ‌ని, నేరారోప‌ణ రుజువైతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టిటిడిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు.

చక్రస్నానంతో ముగిసిన  శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tags: Mourning the employees who are causing the company to become worse:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *