ఉద్యమకారులంటే కేసీఆర్ కు చిన్నచూపు

Move the KCR to the activists

Move the KCR to the activists

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులపై ప్రభుత్వం ఎందుకు కేసులను ఎత్తివేయలేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం వచ్చినా.. కేసుల కారణంగా యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పని చేసిన మున్నూరు రవికి కలెక్టరేట్ ముట్టడిలో..
ఇటీవలే ఆరు నెలల జైలు శిక్ష పడిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకోకపోవడం దారుణమన్నారు. రైల్ రోకోకు సంబంధించి 260 కేసులు నమోదైతే.. 10 కేసుల్ని ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోపే ఉపసంహరించారన్న రేవంత్…
రైల్వే వెనక్కి తీసుకున్న కేసులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులేన్నారు. ‘వందలాది మంది ఉద్యమకారులపై రైల్వే శాఖ కేసులు ఉపసంహరించలేదు. 260 కేసుల్లో పది మాత్రమే వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది న్యాయమేమనా?’
అని రేవంత్ నిలదీశారు. ‘ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు 3152. కేవలం 1150 కేసులు మాత్రమే ఉపసంహరించారు. ఉద్యమకారులను కేసీఆర్ వేధిస్తున్నారు. రైల్వే శాఖ, మోదీ సర్కారు కూడా కేసీఆర్‌ ఫ్యామిలీపైనే ప్రేమ చూపించడానికి కారణం ఏంటి? ఉద్యమకారులపై కేసులను తొలగించకపోవడానికి కారణం ఏంటి?’ అని రేవంత్ ప్రధాని మోదీని, బీజేపీ నేతలను నిలదీశారు.
Tags: Move the KCR to the activists

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *