మహానాడుకు తరలిరండి
విశాఖపట్నం ముచ్చట్లు:
.మహానాడు కి తరలిరండి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ… ఈ నెల 27 28 న మహానాడు రాజమండ్రి లో జరపబోతున్నాం మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నభుతొ నభవిష్యత్తు గా జరుపుకునే విధంగా వేడుక జరుపుకుంటున్నాం అని అన్నారు తెలుగు వారి గొప్పదనం గుర్తింపు తెచ్చిన అన్న ఎన్టీఆర్ అని అన్నారు.ఎంతో మంది కి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోంది. ఒక్క నియంత పరిపాలన కొనసాగుతుంది అని అన్నారు
ప్రజలు స్వేచ్ఛను మార్పును కోరుకుంటున్నారు అని అన్నారు రాబోయే ది స్వేచ్ఛ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీయేనని అన్నారు.

నాడుఎన్టీఆర్ ప్రజల కోసం కొత్త రాజకీయాన్ని తెచ్చారు నేడు జగన్ తండ్రి అధికారం అడ్డుపెట్టికొని ఒక్క చాన్స్ అంటూ అధికారం లోకి వచ్చి ప్రజలను దగా చేస్తున్నారని అన్నారు బాగా అనుభవం ఉన్న పార్టీ,సీనియర్ నేతలు, యువత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మాట్లాడుతు ఎన్టీఆర్ ఎవరికి సొత్తు కాదు తెలుగు వారి ఆత్మభిమానం అని అన్నారు రాజమండ్రి మహానాడు లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పారు వైసీపీ ప్రభుత్వం నియమ నిబంధనలు లేకుండా రాక్షసతత్వంగా వ్యవహరిస్తుందని అన్నారు వ్యవస్థలు అంటే లెక్కే లేదుఈ వ్యవస్థలపై భక్తిని భయాన్ని పోగొట్టిన ఘనత వైసిపి కె దక్కుతుందని అన్నారు పోలీసు లు వైసిపి వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు.
Tags; Move to Mahanadu
