మీ టూపై కేంద్రంలో కదలిక… కమిటీ ఏర్పాటు

Move your tube center ... set up the committee

Move your tube center ... set up the committee

– బాసటగా నిలిచిన రాహుల్
Date:12/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం భారత్ లో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, గేయ రచయిత వైరముత్తు, నవలా రచయిత చేతన్ భగత్, టాటా మోటార్స్ ఉన్నతాధికారి సురేశ్ రంగరాజన్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్  తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ పలువురు మహిళలు బయటికొచ్చారు.  అన్ని వైపుల నుంచి విమర్శలు పోటెత్తడంతో కేంద్రం స్పందించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు వీలుగా సీనియర్ న్యాయ నిపుణులతో ఓ కమిటీని నియమిస్తామని ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఈ రోజు ఓ ప్రకటనను విడుదల చేసింది.పది, పదిహేనేళ్ల తర్వాత సైతం లైంగిక వేధింపుల ఫిర్యాదులను అనుమతించాలన్నారు. లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడ్డారనేది బాధితులకు తెలుస్తుందని అందుకే తాము ఫిర్యాదులకు ఎలాంటి కాలపరిమితి ఉండరాదని న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని మంత్రి తెలిపారు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ పదేళ్ల కిందట ఓ సినిమా సెట్‌లో తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది.
మరో వైపు సినీ పరిశ్రమతో పాటు అన్ని రంగాల్లోనూ పాతుకుపోయిన లైంగిక వేధింపుల జాఢ్యాన్ని ‘మీ టూ’ పేరుతో మహిళలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్, బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తులు తమను లైంగికంగా వేధించారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీటూ బాధితులకు మద్దతుగా నిలిచారు.‘మహిళలతో మర్యాదగా, గౌరవంగా ఎలా ప్రవర్తించాలో ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అలా చేయని వారికి అన్ని రంగాల్లో దారులు మూసుకుపోతుండటం సంతోషకరమైన విషయం. ఇప్పటి పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే నిజాన్ని గట్టిగా, నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉంది’ అని రాహుల్ ఈ రోజు ట్వీట్ చేశారు.
Tags:Move your tube center … set up the committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *