ఇందిరమ్మ ఇళ్లలో మళ్లీ కదలిక

హైదరాబాద్ ముచ్చట్లు:

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం… అత్యంత ప్రతిష్టాత్మకంగా… ఇందిరమ్మ ఇళ్ల నిర్మణాన్ని చేపట్టింది. లక్షలాది ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు ఇచ్చింది. అయితే.. చాలా వరకు పూర్తి కాలేదు.. ఇంతలోనే ప్రభుత్వం మారడంతో.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచారణ చేపట్టింది, తర్వాత ఈ ఇళ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో.. లబ్దిదారులే, అప్పులు తెచ్చి అక్కడక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో… ఆశలు చిగురిస్తున్నాయి. తమకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి.. ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో… పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే.. 70 గజాల్లో.. ఇళ్లను నిర్మించి ఇచ్చింది, కొత్త ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో పాటు… రుణం కూడా మంజూరుకు అనుమతి ఇచ్చింది. రెండు విడతలో ఈ ఇళ్లను మంజూరు చేశారు. 2014లో.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో…. ఈ పథకం ముందుకు సాగలేదు. ఈ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో ఆక్రమాలు జరిగాయని.. బీఆర్‌ఎస్‌కు విచారణకు ఆదేశించింది. ఇందిరమ్మ ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందఅయితే.. ఈ ఇళ్ల గురించి పట్టించుకోలేదు.. చాలా వరకు అసంపూర్తిగా నిర్మించారు. శిథిలావస్థలోకి చేరుకున్నాయి. కనీస వసతలు లేక…

 

ఈ కాలనీలో అడుగు పెట్టలేకపోయారు లబ్దిదారులు.. ఎండకు ఎండుతూ … వానకు తడుస్తూ.. ఇందిరమ్మ ఇళ్లు మరింత అధ్వాన్నంగా మారిపోయాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఇళ్లకు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు.. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో లబ్దిదారుల ఆశలు చిగురుస్తున్నాయి. నిధులు మంజూరు చేస్తారని… ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. కనీస సౌకర్యాలు కల్పిస్తారనే అభిప్రాయం వ్యక్తయవుతుంది… చాలా మంది లబ్దిదారులు అప్పులు తెచ్చి, ఇళ్లను నిర్మించుకుకున్నారు. ఈ అప్పులను ప్రభుత్వమే తీర్చాలని కోరుతున్నారు.ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు.. చాలా వరకు… విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదు.. దీని కారణంగా.. ఇందిరమ్మ కాలనీలు అంధకారంలో ఉన్నాయి. కనీస సౌకర్యాలు… లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు లబ్దిదారులు. అప్పులు తెచ్చుకొని.. ఇళ్లను నిర్మించుకున్నామని. లబ్దిదారులు చెబుతున్నారు. తమకు.. కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్నామని చెబుతున్నారు.

Tags: Movement again in Indiramma houses

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *