అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు-సీపీఐ

నంద్యాల  ముచ్చట్లు:


నంద్యాల పట్టణంలో మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో  వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలిపినడం జరిగిందన్నారు. అయితే మంగళవారం బందును భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని నిన్న సాయంత్రం నుండే నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులను ఇతర వాపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లలో నిర్బంధించడం సమంజసం కాదన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అక్రమ అరెస్టులను భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు . రాష్ట్ర ప్రభుత్వం అరచేతిని అడ్డం పెట్టుకొని సూర్యకాంతిని ఆపలేరని ఆ విధంగా పోలీసుల నిర్బంధాల ద్వారా విద్యార్థి ఉద్యమాలను ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందన్నారు.

 

Tags: Movements cannot be stopped by illegal arrests: CPI

Leave A Reply

Your email address will not be published.