తరలిపోతున్న  చెరువు మట్టి

Date:12/10/2018
కడప ముచ్చట్లు:
కడప నగర పరిధిలోని పుట్లంపల్లె, చింతకొమ్మదినె్న మండల పరిధిలోని ఇప్పెంట, కాంబల్లె, చింతకొమ్మదినె్న, ఎర్రచెరువు, కొప్పర్తి, ఊటుకూరు తదితర చెరువుల నుండి రాత్రిం బవళ్లు తేడా లేకుండా జేసీబీలతో ట్రాక్టర్ల ద్వారా చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కడప నగరానికి చుట్టుపక్కల చెరువులు ఉండటంతో చెరువుల్లోని మట్టి తరలింపు నగర పరిధిలోని పునాదులు, స్థలాలు, గుంతల్లో మట్టిని నింపుకునేందుకు, కొత్తగా రోడ్లు వేసుకునేందుకు చెరువుల్లోని మొరంమట్టిని తరలించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.
ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలిసినా మామూళ్లమత్తులో పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన వెలిబచ్చుతున్నారు. చెరువుల్లోని సారవంతమైన మట్టిని రైతుల పొలాలకు తోలుకునేందుకు సవా లక్ష కారణాలు చెప్పి మట్టిని తరలించవద్దని నిరాకరిస్తున్న అధికారులు కాంట్రాక్టర్లకు మాత్రం రాత్రికి రాత్రే అనుమతులు మంజూరు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. గత సంవత్సరం కాలంగా చెరువుల్లో మట్టిని స్థానిక నాయకులు, కాంట్రాక్టర్లు శుద్దమట్టి, చెట్లకు ఎర్రటి మట్టిని ఒకట్రిప్పు ట్రాక్టరు రూ. 1000 నుంచి 1500వరకు అమ్ముకుంటున్నా రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోక పోవడం, గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే జేసీబీ, ట్రాక్టర్లను పట్టుకుని మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచడం పరిపాటి అయ్యింది.
గత ఏడాది చింతకొమ్మదినె్న చెరువులో 50అడుగుల మేర జేసీబీలతో గుంతలు తవ్వి మట్టిని తరలిస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడి రెండుట్రాక్టర్లు మట్టిలో కూరుకుపోయి నుజ్జు నుజ్జు కాగా మిట్టమీదపల్లెకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మట్టిలోకూరుకుపోయి చనిపోయారు. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డారు. అప్పటి నుండి నెలపాటు మట్టిని తరలించకుండా ఉన్న అక్రమార్కులు తర్వాత యథేచ్చగా తరలించడం మానలేదు.
చింతకొమ్మదినె్న చెరువులో జేసీబీ ద్వారా ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల సహాయంతో ఏఇ చెరువులో మట్టి తవ్వుతుతున్న జేసీబీతోపాటు మూడు ట్రాక్టర్లు పట్టుకోగా ఇంకా ఎనిమిది ట్రాక్టర్లు దొరక్కుండా వెళ్లిపోయాయి. పట్టుబడిన వాహనాలు చింతకొమ్మదినె్న తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచారు. అప్పటి నుండి పట్టుబడిన వాహనాలు విడిపించుకునేందుకు ఇరిగేషన్ అధికారులు, స్థానిక నాయకులు తహశీల్దార్‌పై వత్తిడిలు అధికమయ్యాయి.
ఈవిషయమై సికెదినె్న తహశీల్దార్ రమ మట్టిని తరలించేందుకు ఇప్పెంట చెరువులో ఇరిగేషన్ అధికారులు అనుమతి మంజూరు చేస్తే చింతకొమ్మదినె్న చెరువులోని మట్టిని తరలించడం సరైన పద్ధతికాదన్నారు.
Tags; Moving pond soil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *