Natyam ad

ఎంపీ, ఎమ్మెల్యే అంటే ముస్లిం మైనార్టీలు – ఎంపీ మిధున్‌రెడ్డి

– మీ ఆశీస్సులు ఎల్లవేళలా అందించండి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎంపీ, ఎమ్మెల్యే అంటే ముస్లిం మైనార్టీలని, ముస్లిం మైనార్టీల ఆశీస్సులతో తాము ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నామని ఈ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడు అలాగే ఉంచాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు , లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని షాదిమహాల్‌లో ముస్లింలతో ఇఫ్తార్‌విందులో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ముస్లింల సమాధుల వద్ద కమర్సియల్‌ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.2.50 కోట్లు ఇస్తామని హామి ఇచ్చారు. ప్రస్తుతం షాదిమహాల్‌కు రూ. 6 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రభుత్వ నిధులు కాకుండ మైనార్టీల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామన్నారు. ఏకష్టం వచ్చినా మైనార్టీలకు అండగా ఉంటామని ఎంపీ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ షన్‌మోహన్‌ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తామన్నారు. తొలిసారిగా ముస్లింల ఇఫ్తార్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని , ముస్లింలు అందరికి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంజుమన్‌ కమిటి వారు, చింతపండు వ్యాపారులు వినతిపత్రాలు అందజేశారు. ముస్లింలు ఎంపీ మిధున్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఎంఎస్‌.సలీం, ఖాదర్‌, ఇర్ఫాన్‌, మస్తాన్‌, షామీర్‌, సలీం తదితరులు పాల్గొన్నారు.

 

Tags; MP and MLA mean Muslim minorities – MP Midhun Reddy

Post Midle