Natyam ad

మాస్టర్స్ క్రికెట్ లీగ్ విజేతలకు ఎంపి గురుమూర్తి బహుమతుల ప్రదానం

గూడూరు ముచ్చట్లు:


క్రీడలను ప్రోత్సహిస్తూ హరి చంద్రారెడ్డి ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు గూడూరు పట్టణంలో నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక క్రీడ కార్యక్రమాలు నిర్వహించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.  గూడూరు పట్టణంలో జరిగిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీల బహుమతి ప్రధాన కార్యక్రమంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మూడు రోజులుగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. విజేతగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జట్టు నిలిచింది.  ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతిఎంపి గురుమూర్తి హాజరై ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు.  అనంతరం జరిగిన సమావేశంలో విన్నర్ ,మరియు రన్నర్ బెస్ట్ ఫీల్డర్ బెస్ట్ బ్యాట్స్మెన్ లకు బహుమతులు అందజేశారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలను ప్రోత్సహిస్తూ హరిచంద్ర రెడ్డి ఈ పోటీల నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిరంతరం పట్టణాభివృద్ధి గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారని తెలిపారు.

 

 

 

గూడూరు పట్టణ సమీపంలోని దివి పాలెం లో రోడ్డు సమస్య ఉందని తెలియజేశారని రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల మంజూరు చేస్తామని అన్నారు.  రాబోయే రెండు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ  సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎంతో ఆనందంగా మిత్రులు కలయికతో ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంవత్సరం మా జట్టు విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. నిర్వాహకులు కనుమూరు హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ  గత 14 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని  క్రికెట్ పై ఉన్న మక్కువతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కొత్త క్రీడాకారులు వస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఈ పోటీలు కొనసాగిస్తామని  వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కనుమూరు రవిచంద్ర రెడ్డి ,మనపాటీ రవీ,దేవానంద్ ,నాగేశ్వరరావు ,నూర్ మహమ్మద్ ,కరిముల్లా ,క్రీడాకారులు పాల్గొన్నారు .

 

Post Midle

Tags; MP Gurumurthy presents prizes to Masters Cricket League winners

Post Midle