చంద్రబాబును కలిసిన ఎంపీ జేసీ

MP JC in meeting with Chandrababu

MP JC in meeting with Chandrababu

Date:19/09/2018
అమరావతి ముచ్చట్లు:
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సమావేశం ముగిసింది. బుధవారం  ఉదయమే సీఎం నివాసానికి వచ్చి కలిసిన జేసీ, తాడిపత్రిలోని ప్రభోధనంద స్వామిజీ వ్యవహరం, చినపొలమాడలో జరిగిన ఘటన, పోలీసుల వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
తాను ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులను కూడా సీఎంకు వివరించారు. జరిగిన పరిణామాలపై సుదీర్ఘవివరణ ఇచ్చినట్టు సమాచారం.  స్వామీజీకి చెందిన కొన్ని వీడియో క్లిప్పింగులను కూడా చంద్రబాబుకు చూపించారు.  చంద్రబాబుతో ఏకాంత భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా జేసీ వెళ్లిపోయారు.
Tags:MP JC in meeting with Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *