Natyam ad

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపి కేశినేని

విజయవాడ ముచ్చట్లు:

 


దేవి శరన్నవరాత్రులు మహోత్సవములో భాగంగా ఈరోజు సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూలా నక్షత్రం రోజున విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. దర్శన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలా నక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని , ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని అన్నారు. అమ్మ వారి ఆశీస్సులతో దర్శనం చాలా బాగా జరిగింది. దేశం,రాష్ట్రం బావుండాలని కోరుకున్నాను.  నారా చంద్రబాబు నాయుడు  తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి 45 సంవత్సరాలుగా కృషి చేసిన గొప్ప వ్యక్తి. చంద్రబాబు  సంపూర్ణ ఆయురారోగ్యాలతో క్షేమంగా బయటకురావలని కోరుకున్నాను. అమ్మవారి కృపా  కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

 

Tags; MP Keshineni presented silk clothes to Durgamma

Post Midle
Post Midle