Natyam ad

పవన్‌షో తో బాబుకు ఓట్లు వేయరు-ఎంపీ మిధున్‌రెడ్డి డిమాండ్‌

-రాజకీయం సినిమా కాదు
– కాపుల ఓట్ల కోసం పవన్‌కు గాలం
– బాబు, పవన్‌లలో సీఎం అభ్యర్థి ఎవరు.

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ షోలకు బాబుకు ఓట్లు వేయరని , రాజకీయం సినిమా కాదని కాపుల ఓట్ల కోసం చంద్రబాబు వల వేశాడని, బాబు, పవన్‌లలో ఎవరు సీఎం అభ్యర్థి తేల్చి ప్రజలకు తెలియజేయాలని లోక్‌సభ ఫ్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి నిలధీశారు. సోమవారం పుంగనూరు మున్సిపాలిటిలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళంకాలనీ, దోబీకాలనీ, షిరిడిసాయినగర్‌, కొత్తయిండ్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మిధున్‌రెడ్డి మాట్లాడుతూ 2019 నుంచి పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబుతో జతకట్టడం, కాపుల ఓట్లు వైఎస్సార్‌సీపీకి పడకుండ డ్రామాలాడి అభ్యర్థులను నిలబెట్టారని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లలో ఎవరు ముఖ్యమంత్రి తేల్చాలన్నారు. సీఎం అభ్యర్థిగా చెప్పుకునే పవన్‌ , చంద్రబాబుతో జత కట్టడం సిద్దాంతాలు లేకపోవడమేనన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎత్తుగడలు , పవన్‌కళ్యాణ్‌ అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోందన్నారు. బాబు , పవన్‌కళ్యాణ్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించిందని ఆర్భాటాలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుందని ఎంపీ కితాబు ఇచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌కూడ సినిమా ఈవెంట్లు అనుమతి పొంది నిర్వహించారని తెలియజేశారు. చంద్రబాబునాయుడు, సభలు, ర్యాలీల్లో అమాయకులను బలి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం సభకు చంద్రబాబు అనుమతి తీసుకోకపోవడం చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. చట్టాన్ని గౌరవించలేని వారు సమాజాన్ని ఏ విధంగా పాలిస్తారని నిలధీశారు. చంద్రబాబు , పవన్‌కళ్యాణ్‌లు జీవోను చదవాలని డిమాండ్‌ చేశారు. కుప్పంలో చంద్రబాబు నకిలి పేషంట్లకు ఆసుపత్రిలో చికిత్సలు చేయించి షో ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ఓట్లు వేయమని కోరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బాబు, పవన్‌లు ఒకటైనా వారికి ఓట్లు పడవని , వారికి తగిన గుణపాఠం నేర్పుతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా పాల్గొన్నారు.

 

Tags: MP Midhun Reddy demands that Babu won’t vote for Pawanshow

Post Midle