పుంగనూరు బైపాస్‌రోడ్డుకు మహర్దశ- ఫలించిన ఎంపీ మిధున్‌రెడ్డి కృషి
– రూ. 50 కోట్లు విడుదల
– టెండర్లు మే 5 నుంచి
పుంగనూరు ముచ్చట్లు:

జమీందారుల పాలన నుంచి ఎలాంటి విస్తరణకు నోచుకోని పుంగనూరు పట్టణ బైపాస్ రోడ్డుకు మహర్ధశ పట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఎంపీ మిధున్ రెడ్డి రెండు లైన్ల రోడ్డు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి సుమారు రూ.50కోట్లు మంజూరు చేయించారు. ఆపనులను చేపట్టేందుకు అనంతపురం ఎస్‌ఈ ఆర్‌అండ్‌బి అధికారులు టెండర్లు ఆహ్వానిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మే 5న బిడ్డింగ్ డాక్యుమెంట్లు విడుదల చేయనున్నారు. కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనాలని కోరారు. కాగా పట్టణ రోడ్డు విస్తరించి , రెండు లైన్ల రోడ్డు, డివైడర్లు, ఎల్‌ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బైపాస్‌రోడ్డు , మినిబైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. తాజాగా ఎంబిటి రోడ్డు విస్తరణ చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టిన మంత్రి కుటుంభానికి కృతజ్ఞతలు తెలిపారు.
Tags; MP Midhun Reddy’s efforts paid off for the Punganur bypass road
