Natyam ad

మదనపల్లెలో 1న ఎంపీ మిధున్ రెడ్డి పర్యటన..

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లె మండలం, పట్టణంలో బుధవారం రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్ స్పీకర్, లోకసభ వైసిపి పక్ష నేత, ఉభయగోదావరి జిల్లాల వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి వెంకట
మిధున్ రెడ్డి పర్యటించనున్నారని జడ్పిటిసి ఉదయ్ కుమార్, ఎంపీపీ వెలుగు చంద్రా రెడ్డమ్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు నూర్ అజాం, జింకా వెంకటా చలపతిలు ఒక ప్రకటనలోతెలిపారు. బుధవారం ఉదయం సీటీఎం గ్రామంలో సీసీరోడ్లు ప్రారంభిస్తారని,అనంతరం పట్టణంలో ఉదయం 9.30 ఏర్పాటు చేసిన నూతన ఆర్వో
ప్లాంటును ఎంపీ ప్రారంభిస్తారన్నారు. అనంతరం 10 గంటలకు ఎర్రగాని మిట్ట
వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల పత్రాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తారనారు.
స్థానిక జడ్పీ హైస్కూల్లో మదనపల్లె పట్టణం, రూరల్ మండలంలోని వైఎస్ఆర్
చేయూత, ఆసరా పథకాల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారన్నారు.
మధ్యాహ్నం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి
అందులో ప్రజలు నుంచి సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరిస్తారన్నారు.
ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలకు హాజరై
విజయవంతం చేయాలని వారు కోరారు.

 

Post Midle

Tags: MP Midhun Reddy’s visit to Madanapalle on 1..

Post Midle

Leave A Reply

Your email address will not be published.