చింతపండు సమస్యపై మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన ఎంపి మిధున్‌

MP Mithun meets Minister Nirmala Sitharaman on the issue of tamarind

MP Mithun meets Minister Nirmala Sitharaman on the issue of tamarind

– 5 శాతం జీఎస్టీ ని రద్దు చేయాలి
– నిత్యవసర వస్తువుకు పన్నులా..? అంటు ఆవేదన
– వ్యాపారులకు ఊరట

Date:30/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

చింతపండు వ్యాపారుల సమస్యలపై రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. చట్టంలో లోపాలను గుర్తించి, చింతపండు వ్యాపారులకు జరుగుతున్న ఆన్యాయాలపై మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలసీతారామన్‌ను పార్లమెంటులో కలిసి వివరించారు. ఈ మేరకు ఆయన మంత్రి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలోని పుంగనూరు , నరసన్నపేట, తుని, విజయనగరం, సాలూరు, ధర్మవరం, కిర్లంపూడి, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, మదనపల్లె, హందూపురంతో సహా అనేక ప్రాంతాలలో చింతపండు వ్యాపారం జోరుగా జరుగుతోందన్నారు. ప్రభుత్వం చింతపండుకు హెచ్‌ఎస్‌కోడ్‌ను 0813 నుంచి 0810కి మార్చాలని , 5శాతం జిఎస్టీని రద్దు చేయాలని కోరారు. జిస్టీ చట్టంలోడ్రైడ్‌ అన్న పదం చింతపండుకు వర్తించదని ఎంపి వివరించారు. చింతపండు ముడిసరుకు ( బొబ్బటకాయ, కట్టికాయ, పూపండుకు జిఎస్టీ పరిధిలోకి రాదన్నారు.) డ్రైడ్‌ అనే పదం కేవలం చింతపండు ఊడికించి పల్ప్తయారు చేస్తారని, దీనికి మాత్రమే జిఎస్టీ వర్తిస్తుందని ఎంపి తెలిపారు. కానీ అధికారులు ఆనాలోచితంగా జిఎస్టీ 5 శాతం వసూలు చేస్తున్నారని మంత్రికి తెలిపారు. చింతపండు నిత్యవసర వస్తువు అని ప్రతి మహిళ తమ ఇంటిలో చింతపండును వినియోగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నిత్యవసర వస్తువుగా ఉన్న చింతపండుకు 5 శాతం పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో చింతపండు నిత్యవసర వస్తువుగా నిర్ణయించి, ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని, దీనిని గమనించాలని సూచించారు. రాష్ట్రంలో జిఎస్టీ పేరుతో అధికారులు బలవంతపు వసూలు చేయడంతో చింతపండు వ్యాపారులు వీధినపడి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. తక్షణమే చింతపండు పన్నులు ఆపివేసి, చింతపండు వ్యాపారులకు, రైతులకు తగు విధంగా సహాయ సహకారాలు అందించాలని డిమాండు చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. చింతపండు వ్యాపారాలపై ఎంపి మిధున్‌రెడ్డి స్పందించడంతో పుంగనూరు చింతపండు వ్యాపారుల సంఘ నేతలు ఇమ్రాన్‌, హాఫిజ్‌, నాగముని, చాంద్‌బాషా, ఖాదర్‌, ఖాజా, కిజర్‌ఖాన్‌, అమ్ము హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటిలో వీడియో కాన్ఫిరెన్స్

Tags: MP Mithun meets Minister Nirmala Sitharaman on the issue of tamarind

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *