ఘనంగా ఎంపి మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు

 MP Mithun Reddy's Birthday Celebrations

 MP Mithun Reddy's Birthday Celebrations

– పేదలకు అన్నదానం

Date:11/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డికి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల పరిధిలోని వైభవంగా వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌చేసి, పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేసి, సంబరాలు చేసుకున్నారు.

పుంగనూరులో….

రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు ఎంపి మిధున్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో అన్ని ప్రాంతాల్లోను ప్లెక్సిలు ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎంపి రెడ్డెప్ప ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకుడు రాజేష్‌ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బస్టాండులో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే కేక్‌ కట్‌ చేసి, జన్మదిన శుభాకాంక్షలు మిధున్‌రెడ్డికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ , వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పి ప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌లో వైఎస్సార్సీపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దిక్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. అలాగే మండల మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు తులసెమ్మ, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, బూత్‌ కమిటి మేనేజర్‌ అమ్ము, కాపు సంఘ నాయకుడు పూలత్యాగరాజు, ముస్లింమైనార్టీ నాయకులు కిజర్‌ఖాన్‌, అయాజ్‌, జహర్‌ యువజన సంఘ నేతలు జయకృష్ణ, కృపాకర్‌, బండకుమార్‌, జెపి యాదవ్‌, చందారెడ్డెప్పరెడ్డి, శ్రీనివాసులు, ఎంఎం.ఆనంద, హేము తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

Tags: MP Mithun Reddy’s Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *