MP, MLA who launched three crore devices in a government hospital

ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోట్ల పరికరాల ను ప్రారంభించిన యమ్ పీ, ఎమ్మెల్యే

Date:17/10/2020

నంద్యాల  ముచ్చట్లు:

నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోట్ల రూపాయల విలువ చేసే పరికరాల ను పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి నంద్యాల శాసనసభ్యుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం ప్రారంభించారు.  నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఆధునీకరించిని ఐసి వార్డులను మరియు  ఇన్క్యూబ్ లెటర్ యంత్రాలను నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ విజయ్ కుమార్ డి సి హెచ్ ఎస్ శిరీష లతో కలిసి ప్రారంభించారు. నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని ఇప్పుడు  ప్రతి ప్రభుత్వ వైద్యశాల కార్పొరేట్ వైద్య శాల తో సమానంగా ప్రజలకు సేవలు అందిస్తుందని ఆయన అన్నారు ఈరోజు ఇప్పుడే పుట్టిన పిల్లల ను ఒక చోటి నుండి వేరే చోటికి తరలించడానికి అత్యాధునిక మైనటువంటి యంత్రం ఇన్క్యుబేటర్ పరికరాన్ని కూడా ప్రారంభించుకునామన్నారు. ఈ ఇంక్యుబ రే టర్ 108 వాహనంలో ఆమార్చడం జరిగింది అన్నారు. నంద్యాల శాసన సభ్యుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ   నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసుకుని వాటిని ప్రారంభించు కున్నాం అన్నారు.

 

2.70 కోట్ల రూపాయల విలువ చేసే 60 వెంటిలేటర్స్ ను అమర్చు కుంనామని 108 వాహనంలో 8 లక్షల రూపాయల విలువ చేసే ఇంక్యుబ రేటర్ ను కూడా అమర్చుకోవడం జరిగిందన్నారు. పది లక్షల రూపాయల విలువచేసే అదనపు ఐసియు వార్డులను కూడా ఏర్పాటు చేసుకుంనామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల నంద్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు  గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి  నంద్యాల లో ఒక మెడికల్ కాలేజి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేశారని తెలిపారు. ప్రతి పేదవారికి కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఈ ప్రభుత్వ వైద్యశాలలో సేవలు అందిస్తామని అన్నారు. సూపర్డెంట్ విజయకుమార్ మాట్లాడుతూ ఈరోజు 108 వాహనంలో ఇంక్యుబేటర్ యంత్రాన్ని అమర్చడం జరిగిందని దీని ద్వారా అపుడే పుట్టిన శిశువును మెరుగైన వైద్యం కొరకు ఇతర ఆసుపత్రికి సురక్షితంగా తీసుకొని వెళ్లవచ్చునని ఈ యంత్రంలో శిశువుకు సమతల ఉష్ణోగ్రత ఉంచుతుందని శిశువుకు అవసరమైన ఆక్సిజన్ కూడా ఉంటుందని చెప్పారు. ఇలాంటి యంత్రాన్ని  మనం ప్రారంభించుకున మన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్. డాక్టర్ లలిత ఆర్ ఎం ఓ రత్నం డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

కుంకళ్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

Tags:MP, MLA who launched three crore devices in a government hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *