Natyam ad

సొంత నియోజకవర్గం లో ఎంపి రఘురామకృష్ణంరాజు

విజయవాడ ముచ్చట్లు:


వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో అడుగుపెట్టారు.  హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న ఆయనకు,  అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆహ్వానం పలికారు.  భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది.  టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.  రఘురాజుకు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తి పోయింది.  రఘురాజు కూడా అభిమానులకు ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు.  రాజమండ్రి నుంచి భీమవరంకు ఆచంట, పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా వెళ్లారు. వందలాది కార్లు రఘురాజును అనుసరించాయి.  నాలుగేళ్ల తర్వాత ఆయన స్వస్థలానికి వెళ్తుండటం గమనార్హం. ఈ సంక్రాంతిని తన నియోజకవర్గంలో ఆయన సంతోషంగా జరుపుకోనున్నారు.

 

Tags: MP Raghuramakrishnam Raju in own constituency

Post Midle
Post Midle