తిరుమలలో ఎంపీ సీఎం రమేష్

MP ramesh in Tirumala
Date:26/11/2018
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు సీఎం రమేష్ కు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రమేష్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రతిపక్షాలపై కక్ష్య సాధింపుకు ఉపయోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చెల్లుబాటు కాదని మండిపడ్డారు. బీజేపీ కి వ్యతిరేకంగా చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరుగుతు, అందరిని ఏకం చేస్తుండడంతో కేంద్ర బిజెపి నాయకులకు నిద్ర కారువైందని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి పై దుష్ప్రచారం చేస్తున్నారని….వాటిని న్యాయబద్ధంగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు.
Tags:MP ramesh in Tirumala