పుంగనూరులో జగనన్న ప్రాణవాయువు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపి రెడ్డెప్ప , జేసి శ్రీధర్
– సీఎం జగన్‌చే 7న ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటరెడ్డి మిధున్‌రెడ్డి కలసి సొంత నిధులతో ఏర్పాటు చేసిన జగనన్న ప్రాణవాయువు కేంద్రాన్ని ఈనెల 7న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఈ ఏర్పాట్ల కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, జేసి శ్రీధర్ , చైర్మన్ అలీమ్‌బాషా, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ డాక్టర్ శరణ్ కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి రెడ్డెప్ప మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్ కలసి పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రాణవాయువు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ప్రస్తుతం కరోనా , ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆక్సిజన్ కేంద్రం ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు రాఘవేంద్ర , అమ్ము , వైఎస్సార్‌సిపి నాయకులు కనకదుర్గా సత్యనారాయణ, ఇనాయతుల్లాషరీష్, చంద్రారెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: MP Reddeppa, Jesse Sridhar inspecting Jagannath Oxygen Center in Punganur